కందుకూరు టీడీపీలో ముసలం చోటు చేసుకుంది. కందుకూరు టీడీపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కూటమి అభ్యర్ధి ఇంటూరి నాగేశ్వరరావుకు హ్యాండ్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత దివి శివరాం. టీడీపీ రెబల్ అభ్యర్ధి ఇంటూరి రాజేష్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు దివి శివరాం. టీడీపీ అధిష్టానం ఇంటూరి నాగేశ్వరావుకు టికెట్ ఇచ్చినా తాను మాత్రం సహకరించేది లేదని స్పష్టం చేశారు.
తమ కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఇంటూరి నాగేశ్వరావుకు మద్దతు ఇవ్వలేమన్నారు దివి శివరాం. తన వర్గం మొత్తం ప్రత్యక్షంగా ఇంటూరి రాజేష్ కు సహకరించాలని పిలుపు నిచ్చారు. పనిలో పనిగా కందుకూరు టిక్కెట్ కూడా మార్పు ఉండొచ్చని ప్రకటన చేశారు. దివి శివరాం ప్రకటనతో కందుకూరు టీడీపీలో అయోమయం చోటు చేసుకుంది. నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో శివరాంను బుజ్జగించేందుకు రంగంలోకి టీడీపీ నేతలు దిగారు. అయినా కూడా ససేమిరా అంటున్నారు దివి శివరాం.