శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు.. వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

-

శిరోముండనం కేసులు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 10 మంది నిందితులకు విశాఖ కోర్టు జైలు శిక్షను విధించింది. దాదాపు 27 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది. 18 నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులుగా ఉన్నారు. 1996 డిసెంబర్ 26న వెంకటాయపాలెంలో శిరోముండనం ఘటన జరిగింది.

ఎన్నికల కక్షలతో దళిత యువకులకు శిరోముండనం చేశారు. ఇద్దరికి గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలు గీయించారు. 1997 జనవరి 1న ఆనాటి జిల్లా ఎస్పీ కేసు నమోదు చేశారు. తోట త్రిమూర్తులతో సహా 9 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. 1998లో కేసును కొట్టేస్తూ.. ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. మళ్లీ 2000 సంవత్సరంలో కేసును ప్రభుత్వం రీ ఓపెన్ చేసింది. మొత్తం 24 మంది సాక్షుల్లో 11 మంది మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news