బీహార్ కు ఇచ్చిన వరద సహాయం…ఏపీకి ఎందుకు ఇవ్వదు – షర్మిల

-

బీహార్ కు ఇచ్చిన వరద సహాయం…ఏపీకి ఎందుకు ఇవ్వదంటూ కేంద్రంపై వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. నేటికీ దాదాపు మూడు వారాలు, అటు ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలు, మరిన్ని కోస్తా ప్రాంతాల్లో పంటలు, పల్లెలు నీటమునిగి. రైతుల అర్తనాధాలు చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికీ మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా ముఖ్యమంత్రిగారు, రైతులు, ప్రజలూ అలకల్లోలంలో కొట్టుకుపోతున్నారన్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మళ్లీ తాజాగా కోనసీమ వరదనీటిలో చిక్కుకుంది. ఇప్పుడు చేస్తున్న సాయం మీద స్పష్టత ఏది? అని నిలదీశారు.

బీహార్ రాష్ట్రానికి వరద సహాయం కింద వేల కోట్ల రూపాయలు బీజేపీ సాయం చేసింది. మరి ఏపీకి ఎందుకు ఇవ్వదు. ఏపీ పట్ల ఎందుకు కేంద్రానికి ఇంత నిర్లక్ష్య ధోరణి? ఏపీకి చెందిన 25 ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా..? అంటూ ఆగ్రహించారు. మరి ఢిల్లీలో మీ భాగస్వాముల మీద ఒత్తిడి తెచ్చి వరద సాయం, మరిన్ని నిధులు, విపత్తు దళాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. ఇప్పటికీ ప్రాథమిక అంచనా, మధ్యంతర అంచనా జరిపించారా లేదా? నష్టపరిహారం మీద ఇంకా స్పష్టత లేదు? అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news