ఏపీ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు షాక్.. 25 లక్షల నుండి 2.5లక్షలకు కుదింపు!

-

ఏపీ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఊహించని షాక్ తగిలింది. హైబ్రిడ్ విధానంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది చంద్రబాబు సర్కారు. ఈ మేరకు కీలక ప్రకటన కూడా బయటకు వచ్చినట్లు సమాచారం. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలో ఉన్న 1.60 కోట్ల కుటుంబాలకు… ఒక్క కుటుంబం తరఫున ఏపీ ప్రభుత్వం 1700 రూపాయల నుంచి 2000 మధ్య ప్రీమియం కింద ఎంపిక చేసిన బీమా సంస్థకు చెల్లించాల్సి రావచ్చని చెబుతున్నారు.

Good news for those who have Telangana Arogyashri

వార్షిక బీమా పరిమితి రెండున్నర లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ ఈ హైబ్రిడ్ విధానం అమలు చేస్తే… ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పాడే అవకాశాలు ఉన్నట్లు వైసిపి ప్రచారం చేస్తోంది. జగనన్న ప్రభుత్వంలో ఉన్న వార్షిక పరిమితి 25 లక్షల నుంచి 2.5 లక్షలకు కుదిస్తారన్నమాట. వార్షిక పరిమితి పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది అని భారీగా కుదింపు చేస్తున్నారట. ఇదే విషయాన్ని వైసిపి గట్టిగా ప్రచారం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news