ఏపీలో మందుబాబులకు ఊహించని మరో షాక్!

-

ఏపీలో మద్యం దుకాణాలు తెరిస్తే… ఒక్కరోజులో జరిగిన అల్లరి అంతా ఇంతా కాదు! ప్రపంచం మొత్తం ఏపీలో మద్యం దుకాణాల దగ్గర గల క్యూల గురించే మాట్లాడుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో మందు బాబులకు మందు మాపించాలనే ఉద్దేశ్యంతోనే ధరలు పెంచుతున్నాం అని ప్రకటిస్తున్న ఏపీ ప్రభుత్వం.. మరోసారి ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. దీంతో మందు బాబులకు మరో గట్టి షాక్ తగిలిందనే అనుకోవాలి. ఇప్పటికే ఎక్కడా లేని రేట్లు ఏపీలో ఉన్నాయని తెగ ఫీలయిపోతుంటారు మందు బాబులు… ఈ క్రమంలో కరోనా ట్యాక్స్ పేరుచెప్పి 25 శాతం ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో 50 శాతం రేటు పెంచాలని ప్రభుత్వం భావిస్తుందట!

మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఊహించని షాకిచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే 25 శాతం ధర పెంచిన ప్రభుత్వం.. తాజాగా మరో 50 శాతం పెంచింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నుంచి మంగళవారం నాడు ఉత్వర్వులు వెలువడ్డాయి. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పటి వరకూ మొత్తం 75 శాతం పెంచిందన్న మాట. సోమవారం నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. ఈ పెంచిన ధరలు మంగళవారం నుంచే అమలు కానున్నాయి. దీంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి షాపులు తెరుచుకోనున్నాయి.

ఇవాళ ఉదయం కొన్ని చోట్ల మద్యం షాపులు తెరుచుకోలేదు! నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో మద్యం అమ్మకాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఈ రోజు ఉదయమే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో తిరిగి అమ్మకాలు ఎప్పట్నుంచి ప్రారంభించాలనే దానిపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలని కమిషనర్‌ తెలిపారు. మద్యం షాపుల వద్ద రద్దీని తగ్గించడం, సామాజిక దూరం పాటించడం వంటి చర్యలు తీసుకోవడంపై దృష్టిపెట్టాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం నిర్ణయించింది. దీనికి గానూ… టోకెన్‌ పద్ధతిని అమలు చేసే అంశంపై పరిశీలిస్తున్నారట!

Read more RELATED
Recommended to you

Latest news