వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కు షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు కు షాక్ త‌గిలింది.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేష‌న్ లో న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు అయింది. ఇటీవ‌ల సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ను ఎంపీ ర‌ఘురామ అస‌భ్య ప‌దాల‌తో దూషించాడ‌ని కొంత మంది వ్య‌క్తులు ఎంపీ ర‌ఘురామ‌పై ఫిర్యాదు చేశారు.

ysrcp mp raghurama krishnamraju to respond on notices issued by party

సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ను అస‌భ్య ప‌దజాలంతో దూషించ‌డంతో పాటు.. కూలం పేరుతో తీవ్ర మైన వ్యాఖ్య‌లు చేశార‌ని వారు ఫిర్యాదులో తెలిపారు. ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయాల‌ని ఫిర్యాదులో తెలిపారు. అలాగే సీఐడీ చీఫ్ ను దూషించినందుకు ఎంపీ ర‌ఘురామ‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని పోలీసుల‌ను కోరారు. అయితే బ్యాంకుల‌ను మోసం చేస్తు ప్ర‌జ‌ల‌ను సోమ్మును దుర్వినియోగం చేసిన వ్య‌క్తి అధికారిపై నిజాయితి గురించి మాట్లాడే హ‌క్కు లేద‌ని అన్నారు.