Shri Sathyasai: ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. పల్లె వెలుగు బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలుగురు ప్రయాణికులకు గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గుమ్మలకుంట సమీపంలో పల్లె వెలుగు బస్సు బోల్తా కొట్టింది.

నల్లమాడ నుంచి అనంతపురంకు వస్తున్న సమయంలో గుమ్మలకుంట సమీపంలో పల్లె వెలుగు బస్సు బోల్తా కొట్టింది. అయితే.. ఈ ఘటన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే.. ఇందులో ఉన్న కొంత మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు గాయాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.