‘కర్మ’ఫలం ఇది.. వైసీపీపై సీమెన్స్‌ మాజీ ఎండీ పోస్టు

-

ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ, ఎన్డీఏ, జనసేన కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే తాజాగా వైసీపీ ఓటమిపై సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. కర్మ ఫలం ఇది అంటూ ఆయన చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

కర్మ’ఫలం ఇది.. అని సీమెన్స్‌ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌ గత వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘న్యాయం గెలుస్తుంది.. అని నేను చెప్పిన మాటల్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిజం చేశారు’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మరోవైపు ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలని ఆకాంక్షిస్తూ… సీమెన్స్‌ ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వం బురద చల్లిన తీరుపై గతంలో లోకేశ్, బ్రాహ్మణిలు చేసిన పోస్ట్‌లను ట్యాగ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news