అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించే అంశంపై ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఆరు నెలల్లోగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇంధన శాఖ సమీక్షలో స్పష్టం చేసారు మంత్రి పెద్దిరెడ్డి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల బిగించాలంటే రూ. 6480 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రైతులు చెల్లించే వ్యవసాయ విద్యుత్ ఛార్జీలను తిరిగి రైతుల ఖాతాలకు జమ చేసేందుకు అవసరమైన బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లు బిగింపు సక్సెస్ అయిందన్నారు అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 33.75 శాతం మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ఆదా అయిందని అధికారుల లెక్కలు వేస్తున్నారు. అయితే డితో రైతులకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని విపక్షాలు అంటున్నాయి.