విజయసాయి రెడ్డి కి సవాల్ విసిరిన సోము వీర్రాజు

-

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కి సవాల్ విసిరారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తున్నది కేవలం ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే అని అన్నారు. రాష్ట్రానికి ఏం చేశామన్నది వివరంగా ఒక పుస్తకం బహిరంగ సభలో ఆవిష్కరించాం అని అన్నారు. ఆ పుస్తకాన్ని విజయసాయిరెడ్డి అధ్యయనం చేసి మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు లాగా మాట్లాడితే మీకు అదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. వైజాగ్.. చెన్నై కారిడార్ కి ల్యాండ్ ఎక్విజషన్ చేశారా.?

విజయవాడలో నేచుర్ క్యూర్ ఆసుపత్రి కి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్నారు. మూడు లక్షల కోట్లతో జాతీయ రహదారులు ఇస్తానని కేంద్ర మంత్రి, ముఖ్య మంత్రి సమక్షంలో బహిరంగ సభలో ప్రకటించారు మీకు తెలియదా? అని అన్నారు. ఉపాధి హామీ పథకం నిధులు ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చామన్నారు. మీరు రెండో పర్యాయం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. బిజెపి పోలీసు కేసులకు భయపడదు అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version