జనసేన నేత నాగబాబుకు బంపర్ ఆఫర్ తగిలింది. ఏపీ మంత్రివర్గంలోకి జనసేన నేత నాగబాబు రానున్నారట.. త్వరలో జనసేన నేత నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి…. కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. మొదట జనసేన నేత నాగబాబుకు టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/07/naga-babu-pawan-kalyan.jpg)
ఆ పదవి బీఆర్ నాయుడికి ఇవ్వడంతో జనసేన నేత నాగబాబును రాజ్యసభకు పంపి స్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే.. తాజాగా టీడీపీకి రెండు, బీజేపీకి ఒక రాజ్యసభ ఖరారు అయ్యాయి. దీంతో జనసేన నేత నాగబాబుకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం అందుతోంది. జనసేన విజయంలో కీలకంగా వ్యవహరించిన నాగబాబుకు ఇప్పుడు ఏపీ మంత్రివర్గంలో అవకాశం రానుంది.