నా ఆస్తుల నుంచి మనోజ్, మౌనికలను తొలగించండి అంటూ మోహన్ బాబు ఫిర్యాదు..!

-

తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేసారు. అసాంఘికశక్తుల నుంచి తన ప్రాణానికి తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు.నేను జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నాను. నాలుగు నెలల కిందట నా చిన్న కొడుకు ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. మనోజ్ తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్ లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు అని మోహన్ బాబు తెలిపారు.

అలాగే మనోజ్, మౌనిక నా ఇంటిని ఆక్రమంగా ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయపడుతున్నాను. నాకు హాని కలిగించే ఉద్దేశంతో ఉన్నారు. నా నివాసాన్ని శాశ్వతంగా ఖాళీ చేయమని బెదిరించారు. సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారు. చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మనోజ్, మౌనికలు ప్లాన్ చేశారు. నేను దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ని. మనోజ్, మౌనిక, అతని సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా ఆస్తుల నుంచి మనోజ్, మౌనికలను తొలగించండి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి. నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు రక్షణ కల్పించండి అని మోహన్ బాబు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news