Sources of Bengaluru rave party in Chittoor: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. బర్త్ డే పార్టీ నిర్వహించిన వాసుకి అరుణ్ అనుచరుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో అరుణ్ A2గా ఉన్న విషయం తెలిసిందే. అటు ఫామ్ హౌస్ యజమానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో A1 గా వాసు, A2 గా అరుణ్ కుమార్, A3 నాగబాబు, A4 రణధీర్ బాబు, A5 మహమ్మద్ అబూబాకర్, A6 గా గోపాల్ రెడ్డి ఉన్నారు. A7 గా 68 మంది యువకులు, A8 30 మంది యువతులు ఉన్నారు. 14.40 గ్రాముల MDMA పిల్స్, 1.16 గ్రామ్స్ MDMA క్రిస్టల్, 5 గ్రాముల కొకైన్, కొకైన్ తో ఉన్న 500 రూపాయల నోట్లు ఉన్నాయట.
5 మొబైల్ ఫోన్స్, ఒక ఫోక్స్ వ్యాగన్ కారు, ల్యాండ్ రోవర్ కారు, కోటిన్నర డీజే ఎక్విప్మెంట్ ఉందని సమాచారం. 73 మంది యువకులు పార్టీలో పాల్గొనగా 59 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే.. 86 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది.