మదనపల్లె రెవెన్యూ కార్యాలయం ఘటన కేసును రెండు రోజుల్లో CID కి అప్పగిస్తున్నాం అని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. తాజాగా మదనపల్లె ఫైర్ యాక్సిడెంట్ విషయంపై మాట్లాడిన ఎస్పీ విద్యాసాగర్.. రెవెన్యూ కార్యాలయం దగ్ద మైన ఘటనలో ఏమైనా కెమికల్స్ ఉపయోగించారా అన్న అనుమానం నివృత్తి కోసం ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోరాం అని అన్నారు.. మదనపల్లి ఆర్డీవో కార్యాలయం దగ్ధ మైన ఘటనలో ఎఫ్ఎస్ఎల్ నివేదికల కోసం శాంపిల్స్ పంపినట్లు తెలిపారు.
45 శాంపిల్స్ ను ఎఫ్ఎస్ఎల్ నివేదికల కోసం పంపాం. అలాగే ఏడు సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్లు కింద మాత్రమే ఇప్పటివరకు కేసులు నమోదు చేసాం. ఎఫ్ఎస్ఎల్ నివేదికలు రాగానే అవసరమైతే ఆ సెక్షన్ ను మారుస్తాం అని పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో పోలీస్ విచారణకు అందరూ సహకరిస్తున్నారు. ఇప్పటివరకు 41 ఏ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపిస్తున్నాం అని ఎస్పీ విద్యాసాగర్ పేర్కొన్నారు.