తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లు విడుదల కాబోతున్నాయి. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టిటిడి పాలకమండలి రిలీజ్ చేయనుంది. జనవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను… రిలీజ్ చేసేందుకు ప్రకటన చేసింది టిటిడి పాలక మండలి. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఆన్లైన్ లో… తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు… పొందవచ్చని తెలిపింది.
ఈ టికెట్ల కోసం తిరుమల శ్రీవారి దేవస్థానానికి సంబంధించిన… అధికారిక వెబ్సైట్ ద్వారా పొందవచ్చని.. వివరించింది టిటిడి పాలక మండలి. అనవసరంగా మోసాలకు పాల్పడకూడదని… బ్లాక్ లో టిక్కెట్లు కొనకూడదని కూడా పేర్కొంది. అలా ఎవరు చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇది ఇలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి… దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. నేరుగా దర్శనానికి… భక్తులను వదులుతున్నారు టిటిడి అధికారులు.