AP : భక్తురాలు స్నానం చేస్తుండగా వీడియో తీసిన లాడ్జ్ రూమ్ బాయ్ !

-

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం చోటు చేసుకుంది. భక్తురాలు స్నానం చేస్తుండగా వీడియో తీశాడు శ్రీకాళ హస్తికి చెందిన ఓ లాడ్జ్ రూమ్ బాయ్. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకోగా, ఇవాళ వెలుగులోకి వచ్చింది. బెంగుళూరు చెందిన సాప్ట్‌వేర్ యువతి కుటుంబ సభ్యులతో స్వామీ వారి దర్శనం కోసం వచ్చారు. ఈ నేపథ్యంలోనే…శ్రీకాళహస్తిలో ఓ లాడ్జిలో ఓ రూం తీసుకున్నారు.

అయితే.. ఈ సమయంలోనే భక్తురాలు స్నానం చేస్తుండగా వీడియో తీశాడు ఆ లాడ్జ్ రూమ్ బాయ్. ఈ వీడియో తీయడాన్ని గమనించి గట్టిగా కేకలు వేసింది ఆ భక్తురాలు. దీంతో రూమ్‌ బాయ్‌ సురేశ్ ను పట్టుకున్న స్దానికులు…చితక బాదారు. అనంతరం తోట్టంబేడు మండలం రౌతుసురమాలకు చెందిన రూమ్ బాయ్ సురేశ్ ను అరెస్టు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news