ఒంగోలు ఒన్ టౌన్ స్టేషన్ కు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి వెళ్లారు. రెండు రోజుల క్రితం వైసీపీ, టీడీపీ ఘర్షణ నేపథ్యంలో ఇరుపార్టీల కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఒంగోలు తాలూకా, ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యాయి.
ఒంగోలు రిమ్స్ ఘటనకు సంబంధించి 11 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇద్దరు వైసీపీ కార్యకర్తలను అదుపు లోకి తీసుకున్నారు పోలీసులు. టీడీపీ కార్యకర్తలను అరెస్టులు చేయకుండా ముందుగా వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయటంపై బాలినేని అభ్యంతరం తెలిపారు. వైసీపీ కార్యకర్తలకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వాలంటున్నారు వైసీపీ నేతలు. ఇందులో భాగంగానే.. రెండు గంటలుగా ఒన్ టౌన్ స్టేషన్ లోనే బాలినేని ఉన్నారు.