శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రానికి పొంచి ఉన్న ప్రమాదం..!

-

సాధారణంగా కృష్ణా నది పై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిర్మించారు. ఈ ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాగు, తాగు నీటితో పాటు విద్యుత్ సరఫరా కూడా జరుగుతుంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు రాతి కట్టడం కావడం చాలా స్టాండర్డ్ గా ఉంది. కానీ శ్రీశైలం ప్రాజెక్టు గట్ల మధ్యలో ఉండటంతో అది నీటి ప్రవాహం ఎక్కువై కాస్త ప్రమాదకరంగా మారినట్టు సమాచారం. 

ముఖ్యంగా శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రానికి పొంచి ఉంది  ప్రమాదం. గత కొద్ది రోజులుగా జీరో ఫ్లోర్‌లో ప్రారంభమైన నీటి లీకేజీ డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ లీక్ అవుతోంది. దీంతో నీరు ప్లాంట్ అధికారుల సమన్వయ లోపంతో  పర్యవేక్షణ కొరవడుతున్నది.  అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తులో ప్లాంట్‌కు భారీ నష్టం సంభవిస్తుందని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటీతో విచారణ చేపట్టాలని కొందరు ఇంజనీర్లు వినతి  అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news