క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం ఖేల్ రత్న అవార్డుకు నలుగురిని ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఖేల్ రత్న అవార్డులను ప్రకటించింది. అతి పిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గెలిచిన గుకేశ్ కు ఖేల్ రత్న అవార్డు ప్రకటించారు. ఒలంపిక్ లో పతకం సాధించిన మను బాకర్ కు ఖేల్ రత్న అవార్డు లభించింది. అలాగే ప్యారిస్ ఒలంపిక్స్ లో మను బాకర్ రెండు పతకాలు సాధించింది.
అదేవిధంగా పారా ఒలంపిక్స్ లో పతకం సాధించిన ప్రవీణ్ కుమార్ ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డు దక్కనుంది. మెన్స్ హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కి అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా భారతదేశంలో క్రీడాకారులకు ఖేల్ రత్న అత్యున్నతమైన క్రీడా గౌరవం. క్రీడా మంత్రిత్వ శాఖ అర్జున అవార్డుల కోసం 17 మంది పారా అథ్లెట్లతో సహా 32 మంది అథ్లెట్లను ఎంపిక చేసింది.