తిరుమల భక్తులకు శుభవార్త.. TTD టికెట్లు విడుదల అయ్యాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కాగా… ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన వసతి గదుల కోటాను ఎల్లుండి రిలీజ్ చేయనుంది.
ఇది ఇలా ఉండగా, తిరుమల నడక దారిలో మరో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఐదేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుతను 24 గంటల్లోనే అటవీ అధికారులు బంధించారు. అయితే పట్టుబడ్డ చిరుత ఏడాదిన్నర వయసున్న పిల్ల చిరుతగా గుర్తించారు. ఈ క్రమంలోని తల్లి చిరుత కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు చెప్పారు. త్వరలో దాన్ని కూడా పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేస్తామని వెల్లడించారు.