ఏపీ వీఐటీ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వీఐటి-ఏపీ యూనివర్సిటీలో రెండు స్టూడెంట్స్ వర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే.. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు స్టూడెంట్స్ వర్గాల మధ్య గొడవ నేపథ్యంలో విజయవాడ – పోలీస్ స్టేషన్కి విద్యార్థి కంప్లైంట్ చేయడానికి వెళ్లగా కంప్లైంట్ ఇవ్వకుండా వెనక్కి పిలిపించింది యాజమాన్యం.
ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి మీడియాకు సైతం తెలియకుండా ఉంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది యాజమాన్యం. అయితే.. అక్కడే ఉన్న కొంత మంది రెండు స్టూడెంట్స్ వర్గాల మధ్య గొడవను మొబైల్ ఫోన్ లో వీడియో తీశాడు. దీంతో ఈ విషయం బయట పడింది. మరి ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.