తనను కస్టడీలో హింసించిన కేసులో సుప్రీంకోర్టు విచారణ పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. తాజాగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఐడీ విచారణ పారదర్శకంా సాగుతుందని చెప్పారు. తనపై దాడి చేసిన అధికారులు అరెస్ట్ అయ్యారు. త్వరలో మరికొందరూ అరెస్ట్ అవుతారని పేర్కొన్నారు. విజయ్ పాల్ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి దురుసుగా ప్రవర్తించారు.
కోర్టులో వాస్తవాలు బయటపడుతున్నాయి. అప్పటి సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ తన ప్రైవేట్ సిబ్బంది తో తనపై దాడి చేయించారని తెలిపారు. అతి త్వరలోనే ఆ వివరాలు అన్ని కూడా బయటికి వస్తాయని వెల్లడించారు. సునీల్ కుమార్ రాష్ట్రం, దేశం విడిచి వెళ్లకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని మీడియాతో రఘురామ కృష్ణంరాజు తెలిపారు.