నేడు పిఠాపురం నియోజకవర్గ నాయకులతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాయకులకు దిశా నిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులు వేద్దాం అన్నారు. ఇంట్లో కూర్చుని గెలిచేయాలి.. అధికారం వచ్చేయాలంటే కుదరదు అన్నారు. పార్టీ కోసం కష్టపడి నాయకులుగా మీరు మరింత మందిని కలుపుకొని ముందుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు.
అన్ని చోట్లకు పవన్ కళ్యాణ్ రావాలంటే ఎలా..? పార్టీ ఉన్నతి కోసం బలంగా కష్టపడాలని అన్నారు. కొత్తతరం నాయకులను తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అన్నారు పవన్ కళ్యాణ్. ఒక కులానికి, ఒక పార్టీకి అన్న పద్ధతి ఉండకూడదు అని.. మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలన్నారు. నాయకత్వం అంతా ఒకే తరహా ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు. నాయకులంతా ముందుగా నియోజకవర్గాలలో సమస్యలు తెలుసుకోవాలని.. పని చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పారు.