ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు..ఎప్పటి నుంచి అంటే ?

-

ఏపీలో స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త. ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించారు. ఏపీలో ఈ నెల 24 నుంచి జూన్ 12వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Summer vacation for schools in AP from 24th of this month to 12th June

జూన్ 12 తర్వాత మళ్లీ పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని వెల్లడించింది ఏపీ విద్యాశాఖ. ఇక ఎండా కాలంలో స్పెషల్ క్లాసులు లాంటివి నిర్వహిస్తే.. కఠిన చర్యలు తప్పవనిహెచ్చరింది ఏపీ విద్యాశాఖ.

కాగా, తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్‌ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్నాయి ఎండలు. దీంతో ఏపీ, తెలంగాణకు వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అటు ఏపీలో నేడు 37 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news