Tillu Square : టిల్లుగాని అరుదైన ఘనత.. ఆ చిత్రాల సరసన

-

సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు (Tillu Square) యూత్ నీరాజనం పడుతున్నారు. టీజర్, ట్రైలర్ రిలీజ్ నుంచే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే డిజె టిల్లు కు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా చరిత్ర సృష్టించింది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వల్ చిత్రాలు పెద్దగా ఆకట్టు కోవనే ప్రచారం ఉంది. అయితే ఆ ప్రచారానికి టిల్లు స్క్వేర్ సినిమా బ్రేక్ వేసింది.

Tillu Square creates sensation in first weekend

ఇటీవల రిలీజైన టిల్లు స్క్వేర్ సినిమా బంపర్ హిట్ అయింది. దీంతో బాహుబలి 2 , దృశ్యం 2, కేజిఎఫ్ 2, హిట్ 2, బంగార్రాజు, కార్తికేయ 2 లాంటి సీక్వెల్ హిట్ సినిమాల సరసన టిల్లు గాడు చేరిపోయాడు.కాగా ఈ మోస్ట్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందట. దాదాపు రూ. 14 కోట్లు పెట్టి టిల్లు గాడి ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకున్నారట. ఇక ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ భారీ ధరకే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news