ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఓవైపు అమరావితియే రాజధానిగా ఉండాలని ప్రజలు డిమాండ్ చేస్తోంటే.. మరోవైపు వైసీపీ మాత్రం విశాఖ రాజధానిగా కార్యకలాపాలు కొనసాగిస్తామని భీష్మించుకు కూర్చుంది. ఈ విషయం కోర్టు ఆదేశాలను కూడా వైసీపీ ప్రభుత్వం పెడచెవిని పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి తరుణంలోనే… ఏపీ రాజధాని అమరావతి కేసు విచారణలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు లో ఏపి రాజధాని కేసు విచారణ ఇవాళ జరిగింది. అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది సుప్రీం కోర్టు ధర్మాసనం. అయితే.. ఏపీ రాజధాని కేసును డిసెంబర్ కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. దీంతో అమరావతి రైతులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.