ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెడదాం, ఎన్నాళ్లు ఈ ఉద్యోగాలు.. ఎప్పుడు ఊడతాయో తెలియదు.. మనకే ఎందుకు ఒక వ్యాపారం మొదలుపెట్టకూడదు. పెట్టొచ్చు కానీ లక్షల్లో పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి..? అసలు ఏ వ్యాపారం అయితే బాగుంటుంది ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతున్నారా..? మీరు ముందు వ్యాపారం చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయితే చాలు కష్టమే మీ పెట్టుబడి. పదివేలతో కూడా బిజినెస్ స్టాట్ చేసుకోవచ్చు. నాణ్యత గల ఉత్పత్తులు మీ సొంత అయితే.. లాభం మీ ఇంటిపేరు అవుతుంది.! ఈరోజు మనం పదివేల పెట్టుబడితో చేయదగ్గ లాభసాటి వ్యాపారం గురించి చర్చించుకుందాం..!
ఈ రోజుల్లో క్యాటరింగ్ బిజినెస్ కు మంచి డిమాండ్ ఉంది. మారిన ఉరుకుల పరుగుల జీవన విధానంలో ప్రతీ ఒక్కరూ చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా క్యాటరింగ్‌కు ఇవ్వడానికే ఆసక్తి చూపుతున్నారు. ఫంక్షన్‌లో భోజనాలదే పెద్ద స్థానం. మనమే చేస్తే.. డే అంతా అక్కడే గడిచిపోతుంది. అదే క్యాటరింగ్ ఇస్తే అన్నీ వాళ్లే తెచ్చి వాళ్లే సర్వ్ చేస్తారు. అసలు మనకు ఆ టెన్షనే ఉండదు. రుచిగా ఉంటాయి, ప్లేట్‌కు మనం చెప్పిన ఐటమ్స్‌ను బట్టి ఛార్జ్ చేస్తారు. ఈ నేపథ్యంలో దీనిని బిజినెస్‌గా ఎంచుకుని మంచి లాభాలు ఆర్జించవచ్చు. కేవలం 10 వేల రూపాయలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇంత తక్కువ ఖర్చుతో ఉద్యోగం కోసం బదులుగా మీ సొంత వ్యాపారం చేయడం చాలా సులభం. ఈ వ్యాపారం ద్వారా నెలకు 25-50 వేల రూపాయలు సంపాదించవచ్చు. కానీ వ్యాపారం పెరుగుతున్నా కొద్దీ మీరు కనీసం 1 లక్ష రూపాయల వరకు లాభం పొందవచ్చు.
ముందు ఏం చేయాలి..?
మీరు ఎప్పుడైనా మరియు ఎక్కడి నుంచైనా కేటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీని కోసం మీరు రేషన్ మరియు ప్యాకేజింగ్‌లో మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు ప్రజలు పరిశుభ్రత పాటించడానికి చాలా ఇష్టపడతారు. దీని కోసం మీరు శుభ్రమైన వంటగదిని కలిగి ఉండాలి.
ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి, నిర్వహించడానికి మనకు మార్కెట్ గురించి పరిజ్ఞానం కలిగి ఉండడం చాలా ముఖ్యం. క్యాటరింగ్ వ్యాపారం దీనికి మినహాయింపు కాదు. మీరు ఈ వ్యాపారంలోకి వెళ్లాలనుకుంటే మీ సర్వీస్ గురించి ఆన్‌లైన్‌లో స్నేహితుల ద్వారా ప్రచారం చేయండి. క్రమంగా మీకు ఆర్డర్లు రావడం ప్రారంభమవుతుంది.
ఎంత ఖర్చు అవుతుంది?
క్యాటరింగ్ వ్యాపారం ప్రారంభించడానికి మీ వద్ద కనీసం రూ. 10,000 ఉండాలి. ఇందులో మీకు పాత్రలు, గ్యాస్ సిలిండర్ మొదలైన వస్తువులు అవసరం. శ్రమ కూడా అవసరం అవుతుంది.
లాభం ఎంత ఉంటుంది?
ఈ వ్యాపారం లాభం విషయానికి వస్తే.. మీరు ప్రారంభ దశలో రూ. 25,000 వరకు సంపాదించవచ్చు. మీ వ్యాపారం ప్రమోట్ చేస్తే పెద్ద పార్టీలలో మీ క్యాటరింగ్ సర్వీస్‌కు డిమాండ్ ఏర్పడినప్పుడు, లాభం పెరగడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మీరు ఈ వ్యాపారం నుంచి ప్రతి నెలా కనీసం 1 లక్ష రూపాయల లాభం పొందవచ్చు. మీ వ్యాపారం మంచిగా మారితే లాభాలు మరింతగా పెరగవచ్చు. దీంతో పాటు కర్రీ పాయింట్ కూడా పెట్టుకుంటే ఇంకాస్త కష్టపడాల్సి వస్తుంది కానీ లాభం మాత్రం మెండుగా ఉంటుంది.
చెప్పినంత సులభం కాదు.. ఈ వ్యాపారంలో మీరు పేరు పొందాలంటే.. మీ వంటలు రుచిగా, నాణ్యంగా ఉండాలి. అదే మీకు గుడ్‌విల్. నాణ్యతలో రాజీపడకుండా ఉంటే త్వరగా మీ బిజినెస్ క్లిక్ అవుతుంది.