BREAKING: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టు సంచలన ప్రకటన చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఎపి సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పై సుప్రీం కోర్టు విచారణ చేసింది. అయితే… ఈ కేసు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
ప్రభుత్వం తరపు న్యాయవాది మారినట్లు సుప్రీం కోర్టుకు చెప్పారు న్యాయవాదులు. ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉన్నందున వాయిదా వేయాలని కోరారు న్యాయవాదులు. దీంతో రెండు వారాలు వాయిదా వేయాలని.. తర్వాత విచారణ చేపట్టాలని కోరారు చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా. లూథ్రా విజ్ఞప్తితో తదుపరి విచారణ రెండు వారాలు వాయిదా వేసింది జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం.