టీటీడీ పాలక మండలిపై స్వరూప నంద స్వామి వివాదస్పద వ్యాఖ్యలు

-

టీటీడీ పాలక మండలిపై విశాఖ శారద పీఠాధిపతి స్వరూప నంద స్వామి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భూమన కరుణాకరరెడ్డి రెడ్డి లాంటి టిటిడి చైర్మన్ ఇంత వరకు లేరని.. కళ్యాణ మస్తు, దళిత గోవిందం పురుడు పోసుకున్నది విశాఖ శారద పీఠం లోనేనని గుర్తు చేశారు.. దళిత గోవిందం అని రచన చేసి ఎన్నో కష్టాలు ఎదురొక్ననం, వైష్ణవ మతోన్మద పీఠాలు ఎన్నో ఆటంకాలు సృష్టించాయని చెప్పారు.

తాళ్ళపాక అన్నమయ్య నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసిన వ్యక్తి ఆనాడు టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి అని.. ఇలాంటి కార్యక్రమాలు టిటిడి ద్వారా ఆనాడు భూమన కరుణాకరరెడ్డి చేశారని వెల్లడించారు స్వరూప నంద స్వామి. ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని అనుకున్నాం.. కరోనా కారణంగా, వారి బుద్ధి మాంద్యం కారణంగా జరగలేదని చెప్పారు.

సనాతన ధర్మం కోసం ఓ కార్యక్రమము కు నడుం బిగించాలని ఆజ్ఞాపిస్తున్నామని.. శైవ, వైష్ణవ మతోన్మాధం వల్ల మరుగున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆది శంకర చార్యుల వారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలని.. కపిల తీర్థం సన్నిధిలో ఉంటే మంచిది, కపిల తీర్థం వెలుగులోకి తెచ్చింది ఆది శంకర చార్యుల వారేనన్నారు. మీడియా కూడా ఆలోచన చేయాలి.. ఆదిశంకర చార్యుల విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు స్వరూప నంద స్వామి.

Read more RELATED
Recommended to you

Latest news