ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు సీఎం జగన్. నేడు 8వ తరగతి విద్యార్థులకు..ఉచితంగా ట్యాబ్ లు పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లను నేడు ఉచితంగా పంపిణీ చేయనున్నారు సీఎం జగన్.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. చింతపల్లిలోనే ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.