తాడిపత్రి మున్సిపాలిటీని గబ్బు పట్టించారు – జేసీ ప్రభాకర్ రెడ్డి

-

అనంతపురం: తాడిపత్రి మున్సిపాలిటీని పట్టించుకోవడం లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పాలేగాళ్లకు ఇస్తే వాళ్లే అన్ని చూసుకుంటారని.. దీనికి ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకని ప్రశ్నించారు. స్పందనకు వెళ్లి అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఆర్జీలు ఇచ్చినా పరిష్కారం కాని పరిస్థితి ఉందన్నారు జేసీ. స్పందనలో ఏ ఒక్కరిక్తెనా పని అవుతుందో చెప్పాలన్నారు. పేదవారికి స్పందన వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు.

కిలోల లెక్క ఫిర్యాదులు ఇచ్చినా.. అదికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు 59 కేజీల వినతి పత్రాలను ప్రభుత్వ శాఖలకు ఆర్జీల రూపంలో ఇచ్చానని తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అధికారులకు ఇచ్చిన అర్జీలు చెత్త పేపర్లు అమ్ముకనే వాడికి అమ్మితే 750 రూపాయలు వచ్చాయన్నారు. ఈ అధికారులకు సిగ్గు లేదని…. ప్రజల ఉసురు తగులుతుందని హెచ్చరించారు.

దేశంలో నెంబర్ వన్ అయిన తాడిపత్రి మున్సిపాలిటీని గబ్బు పట్టించారని మండిపడ్డారు జేసి. తాడిపత్రి ప్రజల కోసం ఏ అధికారి కాళ్ళు పట్టుకోవడానిక్తెనా సిద్ధంగా ఉన్నానన్నారు. ఇదీ దున్నపోతు ప్రభుత్వం అని విమర్శించారు. ప్రజలను పట్టించుకోకుంటే మాప్తె కూడా చెప్పులు వేసే పరిస్థితి వస్తుందన్నారు. వచ్చే గురువారం ఆర్జేడీ కాళ్ళు పట్టుకోడానికి ఆయన కార్యాలయానికి వెళుతున్నానని తెలిపారు జేసి.

Read more RELATED
Recommended to you

Latest news