‘ఏఐ చాట్​బాట్​తో ముప్పు’ అంటూ.. గూగుల్‌కు ‘గాడ్​ఫాదర్​ ఆఫ్ ఏఐ’ హింట‌న్ రాజీనామా

-

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్​తో రానున్న రోజుల్లో పెను ముప్పు ఉందని స్వయంగా గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెఫ్రీ హింటన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐకి కీలకమైన న్యూరల్ నెట్​వర్క్​ను ఆయన డెవలప్ చేశారు. దశాబ్ద కాలంపాటు ఏఐ విభాగంలో ఆయన గూగుల్​ కంపెనీలో విధులు నిర్వహించారు. కానీ ప్రస్తుతం ఏఐ అడ్వాన్స్​మెంట్​ కోసం జరుగుతున్న మార్పులు చూసి ఆందోళన చెందిన ఆయన గూగుల్​కు రాజీనామా చేశారు.

ఏఐ వల్ల రాబోయే తరానికి ఎంత ముప్పు ఉందో తాను.. గూగుల్‌ను వ‌దిలేసిన త‌ర్వాత స్వేచ్ఛ‌గా మాట్లాడ‌వ‌చ్చని హింట‌న్ త‌న ట్వీట్‌లో తెలిపారు. త‌న ఆలోచ‌నా విధానం గూగుల్‌పై ప్ర‌భావం ప‌డ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో రిజైన్ చేసిన‌ట్లు చెప్పారు. ఏఐ చాట్‌బాట్ల‌తో ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న గ‌తంలో ప‌లుమార్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఏఐ చాట్‌బాట్ అంత ఇంటెలిజెంట్‌గా లేవ‌ని, కానీ భ‌విష్య‌త్తులో ఆ టెక్నాల‌జీ మ‌రింత రాటుదేలే అవ‌కాశం ఉంద‌న్నారు. వ‌య‌సు మీద‌ప‌డ‌డం వ‌ల్ల కూడా గూగుల్ సంస్థ‌ను వీడాల్సి వ‌స్తోంద‌ని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news