TDP పాలనలో నేతలు చేసిన తప్పిదాలే విశాఖలో తహశీల్దార్ రమణయ్య హత్యకు కారణం అని వైసిపి ఆరోపిస్తోంది. టిడిపి నేతలు వేలాది ఎకరాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రూ. కోట్లు మింగేసారని అంటుంది. అవే భూములను ప్రభుత్వ భూమిగా గుర్తించి 22ఏలో పెట్టించి కొనుగోలుదారులను మోసం చేశారంది. ఇదే తరహా వివాదంలో రమణయ్య డబ్బులు తీసుకొని పనిచేయకపోవడంతో నిందితుడు సుబ్రహ్మణ్యం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని చెబుతోంది.
ఇక అటు తహశీల్దార్ రమణయ్య హత్య కేసు నిందితుడు జీవితంలో చీకటి కోణాలు బయటపడుతున్నాయి. క్రిమినల్ థాట్ తో రూపొందించిన వెబ్ సిరీస్ లోనూ విలన్ గా నటించారు నిందితుడు గంగారాం. “ది నైట్” పేరుతో రూపొందిన వెబ్ సిరీస్ ట్రెయిలర్ రూపొందించారు. మూడేళ్ల క్రితం రెండు ఎపిసోడ్ లతో వెబ్ సిరీస్ వచ్చింది. 40లక్షలకు పైగా ఖర్చు పెట్టారు సుబ్రహ్మణ్యం గంగారాం. విలన్ పాత్రలో కొట్టి చంపడం, మహిళలను హింసించడం ప్రధానంగా సాగింది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో చూపించినట్టు గానే తహశీల్దార్ రమమణయ్యను కొట్టి చంపాడు గంగారాం.