ఏప్రిల్‌ నుంచి వందేభారత్‌ స్లీపర్‌ రైలు

-

వందే భారత్, నమో రైళ్లను ప్రవేశపెట్టి ప్రయాణికులను సులభంగా హాయిగా తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. వచ్చే నెల (మార్చి) నుంచి ప్రయోగాత్మకంగా ఈ రైళ్లు నడపనున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా తెలిపాయి.

vande bharat train

ఏప్రిల్‌లో ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని రైల్వే వర్గాలు వెల్లడించాయి. తొలి రైలును దిల్లీ-ముంబయి మధ్య ప్రారంభించనున్నట్లు తెలిపాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కంటే వేగంగా ప్రయాణించే ఈ రైలులో 16 నుంచి 20 (ఏసీ, నాన్‌-ఏసీ) కోచ్‌లు ఉంటాయని చెప్పారు. ఈ రైళ్లతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని రైల్వే అధికారులు వివరించారు.

రాత్రివేళల్లో ఎక్కువ ప్రయాణ దూరం ఉండే మార్గాల్లో వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.  ఇప్పటివరకు భారతీయ రైల్వేలో ఉన్న సర్వీసుల కంటే ఇవి వేగంగా ప్రయాణిస్తాయని దీంతో ప్రయాణ సమయం 2 గంటలు ఆదా అవుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news