వైసీపీకి లబ్ధి జరిగేలా DSPల బదిలీలు..ECకి అచ్చెన్న లేఖ

-

వైసీపీకి లబ్ధి జరిగేలా DSPల బదిలీలు చేశారని…కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు.ఇటీవల జరిగిన డీఎస్పీల బదిలీలపై సీఈసీకి అచ్చెన్న ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో లబ్ది చేకూరేలా డీఎస్పీల బదిలీలు ఉన్నాయని సీఈసీకి అచ్చెన్న కంప్లైంట్ ఇచ్చారు అచ్చెన్నా. వైసీపీకి అనుకూలంగా ఉన్నారంటూ 10 మంది డీఎస్పీల పేర్లను సీఈసీ దృష్టికి తీసుకెళ్లిన అచ్చెన్న….డీఎస్పీలపై ఉన్న అభియోగాలనూ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసు కెళ్లారు.

TDP AP chief Achchennaidu’s letter to Central Election Commission

ఫిర్యాదులో పేర్కొన్న డీఎస్పీల పేర్లు పొందుపరిచారు అచ్చెన్నా. సుధాకర్ రెడ్డి, రాంబాబు, ఉమా మహేశ్వర రెడ్డి, వీర రాఘవ రెడ్డి, సి. మహేశ్వర్ రెడ్డి, మురళీకృష్ణా రెడ్డి.
నారాయణ స్వామి రెడ్డీ, శ్రీనాధ్, రాజ్ గోపాల్ రెడ్డి, హనుమంత రావు పేర్లు పొందుపరిచారు. వైసీపీకి అనుకూలంగా ఉండే డీఎస్పీలను వివిధ ప్రాంతాల్లో బదిలీ చేశారని..తాజాగా చేపట్టిన 42 మంది డీఎస్పీల బదిలీలపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించాలని బదిలీ అయిన డీఎస్సీలకు డీజీపీ స్పష్టంగా చెప్పారని లేఖలో అచ్చెన్నాయుడు వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news