తెలుగు కళామా తల్లికి చిరంజీవి మూడో కన్ను : వెంకయ్య నాయుడు

-

ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని ఈ రోజు శిల్పకళా వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ గ్రహీత వెంకయ్య నాయుడు మాట్లాడారు. ముఖ్యంగా సీఎం  రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఇవ్వడం ఒక ఎత్తు అయితే.. వారిని సన్మానించడం మంచి సంప్రదాయం అని.. సంప్రదాయానికి నాంధి పలికిన రేవంత్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నాను అని తెలిపారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. నేను అవార్డులు పెద్దగా తీసుకోలేదు. తీసుకోను. ప్రధాని నరేంద్ర మోడీ ఒత్తిడి చేసి తీసుకోమంటే.. తీసుకున్నాను అని వెంకయ్య నాయుడు చెప్పారు. మట్టిలో మాణిక్యాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.   తెలుగు కళామా తల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అయితే.. చిరంజీవి గారు మూడు కళ్లు అని చెప్పారు. జీవితంలో పట్టుదట ఉంటే ప్రతీ ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. జీవితంలో క్రమశిక్షణ, మాట తప్పకుండా ఉండటం, నీతి, నిజాయితి అలవాటు చేసుకుంటే.. తప్పకుండా పైకి వస్తారు అని తెలిపారు. అలాంటి అవకాశం రావాలంటే.. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే.. నష్టపోయేది లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news