విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఎన్నికల్లో వైసీపీ పార్టీ దూసుకు వెళ్తుంటే… తెలుగుదేశం కూటమి మాత్రం చతికల పడిపోయింది. తాజాగా ఎన్నికల నేపథ్యంలో టిడిపి కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో… టిడిపి పార్టీ పోటీ చేయకూడదని… చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కథనం ఎల్లో మీడియాలోనే రావడం గమనార్హం.
వాస్తవంగా ఈ ఎన్నికల్లో… వైసీపీ చాలా బలంగా కనిపిస్తోందని చంద్రబాబు గ్రహించారట. కౌన్సిలర్లు జడ్పిటిసిలు ఎంపిటిసిలు ఇలా అందరూ… వైసిపి కి అనుకూలంగా ఉండడం జరిగింది. 60 శాతం పైగా వైసీపీకి ఓటు బ్యాంకు ఉన్నట్లు టిడిపి పార్టీ గ్రహించిందట. ఇలాంటి సమయంలో పోటీ చేసి ఓడిపోతే… దారుణ పరిస్థితులు ఉంటాయని గ్రహించారట. అందుకే ఈ ఎన్నికల్లో.. టిడిపి పోటీ చేయకూడదని అనుకుంటున్నారట. మరి టిడిపి పోటీ చేయకుంటే.. జనసేన లేదా బిజెపి నుంచి అభ్యర్థిని పెడతారా అనే సందేహాలు నెలకొన్నాయి.