భువనేశ్వరి యాత్ర… డీజీపీకి టీడీపీ లేఖ

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీకి టీడీపీ లేఖ రాసింది. నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి చేపట్టబోయే యాత్రకు భద్రత కల్పిచాలని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీకి టీడీపీ లేఖ రాశారు. ఈ నెల 25వ తేదీ నుంచి చంద్రగిరి నియోజకవర్గం నారా వారిపల్లి నుంచి ప్రారంభం కానుంది నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర.

Nara Bhuvaneshwari tweet
Nara Bhuvaneshwari tweet

చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన కుటుంబాలను పరామర్శించనున్నారు భువనేశ్వరి. అవాంఛనీయ సంఘటనలు ఏవీ జరగకుండా ఉండేలా విధంగా భువనేశ్వరికి తగిన బందోబస్తు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య. మరి దీనిపై ఏపీ డీజీపీ ఎలా స్పందిస్తారో చూడాలి.

కాగా… పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనం….పుంగనూరులో శ్రీకాకుళం వాసులను చొక్కాలిప్పించిన ఘటన చూసి నేను షాక్ కు గురయ్యాను అంటూ భువనేశ్వరి ట్వీట్‌ చేశారు. ప్రజలందరినీ ఇది నివ్వెరపరిచింది…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనం అని ఆగ్రహించారు భువనేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news