రుషికొండపై నిర్మించిన అక్రమ భవనంలోకి జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు రఘురామకృష్ణ రాజు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించింది శాశ్వత భవనాలేనని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయ భవనాన్ని అంతర్జాతీయ స్థాయిలో 44 అంతస్తుల్లో నిర్మించిన తర్వాత, ప్రస్తుత సచివాలయ భవనాన్ని మరొక దానికి వాడుకుంటామని చెప్పారని, కానీ దాన్ని తాత్కాలిక భవనంగా కొంత మంది పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు.
తాత్కాలిక భవన నిర్మాణానికి అడుగు ఆరువేల రూపాయలు ఖర్చు అయితే… రుషికొండపై నిర్మించిన పర్యాటక శాఖ భవనానికి అడుగు 25 వేల రూపాయలు ఖర్చు కాదా అంటూ సాక్షి దినపత్రిక బరితెగించి ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు. పర్యాటక శాఖ భవనాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ భవనలేనని సాక్షి దినపత్రిక, ప్రభుత్వం తరఫున వివరణ ఇచ్చిందని, హోటల్స్, సమావేశం మందిరాలు కోసం నిర్మించిన టూరిజం శాఖ భవనాలను చిన్న చిన్న మార్పులతో ముఖ్యమంత్రి గారి నివాస యోగ్యంగా మార్చుకుంటే తప్పేమిటని ప్రశ్నించిందని తెలిపారు.