ఆన్ లైన్ మహానాడు బాబుని అలా ఆదుకుంది!

-

ఒక రాజకీయ పార్టీ ఆన్ లైన్ లో ఇంత భారీస్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేయడం దేశచరిత్రలో ఇదే తొలిసారి… టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు… ఆన్ లైన్ లో దేశ విదేశాల కార్యకర్తలను జూం యాప్ ద్వారా ఏకం చేయడం మామూలు విషయం కాదు… కరోనా సమయంలో కూడా మహానాడు విషయంలో వెనక్కి తగ్గకపోవడం బాబు మేధావి తనానికి నిదర్శనం… గత రెండు మూడు రోజులుగా టీడీపీ అనుకూల మీడియాలో హోరెత్తుతున్న వార్తలు, కథనాల తాలూకు సారాంశాలు! ఇది నాణానికి ఒకపక్కే అని పలువురు అభిప్రాయపడుతున్నారు!! అదెలా అనేది ఇప్పుడు చూద్దాం!

కరోనా సమయంలో తన రాజకీయ జీవితంలో మునుపెన్నడూ లేనంత అపఖ్యాతిని బాబు మూటగట్టుకున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! కష్టమో సుఖమో.. కరోనా కాలంలో ప్రజలతో, ప్రజలకు అందుబాటులో ఉండకుండా.. రాష్ట్రం దాటి బయట ఉండటం సరైన చర్య కాదనేది వారి అభిప్రాయం! ఆ సంగతి అలా ఉంచితే.. కరోనా సమయంలో ఆన్ లైన్ మహానాడు బాబుకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి! ఎందుకంటే… ప్రస్తుతం పార్టీ పరిస్థితి, యువకుడైన లోకేష్ ప్రవర్తన, బాబు పనితీరుపై పార్టీలోని కొందరు నేతలు.. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం కార్యకర్తలు గుర్రుగా ఉన్నారనే కామెంట్లూ బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మహానాడు ఆఫ్ లైన్ లో జరిగి ఉంటే మాత్రం బాబుకు కాస్త ఇబ్బందే అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ కరోనా పుణ్యమాని కార్యకర్తల ఆగ్రహం నేరుగా చూడకుండా తప్పించుకోవడమే కాకుండా… జేసీ దివాకర్ రెడ్డిలాంటి వాళ్లు మైక్ పుచ్చుకొని బాబుని ఏ రేంజ్ లో ఏకిపారేసేవారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్యనే మీడియాతో ముచ్చటించిన జేసీ… ఇళ్లలో కూర్చుని దీక్షలు చేయడం, కరోనా సమయంలో పార్టీ సరిగా పనిచేయకపోవడంపై డైరెక్టుగా బాబు పైనే ఫైరయ్యారు! అలాంటిది నేరుగా ప్రజలమధ్య మహానాడు వేదికగా మైక్ దొరికితే ఆగుతారా అంటే… కచ్చితంగా ఆగరనే చెప్పుకోవాలి!

ఈ లెక్కలు అన్నీ చూసుకుంటే… కరోణా పుణ్యమాని ఏర్పాటైన ఈ “ఆన్ లైన్ మహానాడు” బాబుని చాలా రక్షించిందనే అనుకోవాలి! అలాకాని పక్షంలో ఇప్పటివరకూ ఊహించిన ప్రమాధాలు అన్ని జరిగి బాబు పరువు మహానాడు వేదికగా అల్లకల్లోలం అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు! అసలు ఆన్ లైన్ అనే ఆప్షన్ లేకపోతే… ఈసారి కూడా బాబు ఈ మహానాడు వేడుకను జరిపేవారు కాదని… ఈ పరిస్థితుల్లో కార్యకర్తలను నేరుగా ఫేస్ చేసే సాహసం చేసేవారు కాదనే వాదన కూడా వినిపించడం ఈ సందర్భంగా కొసమెరుపు!!

Read more RELATED
Recommended to you

Latest news