తెలంగాణ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో తెలంగాణ అలాగే ఏపీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వర్షాలు విపరీతంగా పడుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. సోమవారం రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం విద్యాసంస్థలను మూసివేసాయి ప్రభుత్వాలు.
అయితే మంగళవారం అంటే ఇవాళ… రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని పాఠశాలలు మూసివేసేందుకు రంగం సిద్ధం చేశాయి. కొన్ని జిల్లాలలో.. వరద ముందు ఇంకా తగ్గలేదు. దీంతో ఏపీలోని గుంటూరు పశ్చిమగోదావరి బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలలో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అదే సమయంలో తెలంగాణలోని ఆయా జిల్లాలలో పరిస్థితి విద్య సంస్థలకు సెలవులు… సెలవులు ఇస్తూ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వరద, వర్ష ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఇవాళ హాలిడే ఉండనుంది..ముఖ్యంగా నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ ఖమ్మం జిల్లాలో ఇప్పటికే సెలవులు ప్రకటించారు.