చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… నారా లోకేష్ పాదయాత్ర వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ లోకేష్ ను అడ్డుకున్నారు పోలీసులు. ఎలాంటి నోటీసులు లేకుండా గంటసేపటి నుంచి పోలీసులు హై డ్రామా సృష్టిస్తున్నారు.

నోటీసులు అడిగితే డిఎస్పీ వస్తున్నారు అని చెబుతున్నారు పోలీసులు. రోడ్డు మీద నుంచి క్యాంపు సైట్ లోకి రాకుండా ఆడుకుంటున్నారు డిఎస్పీ, ఏఎస్పీ. నారా లోకేష్ వద్దకు మీడియా కూడా రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. వస్తే అరెస్టు చేయాలని ఆదేశిస్తున్నారు పోలీసులు. నా తండ్రిని చూడడానికి నేను వెళ్ళకూడదా అని పోలీసులను నీలదీశారు నారా లోకేష్. దీంతో సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు పోలీసులు.