కాళోజి స్ఫూర్తి.. తెలంగాణ సాధనలో, ప్రగతిలో ఇమిడి ఉంది : సీఎం కేసీఆర్‌

-

పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. మన భాషకు అస్తిత్వ స్పృహను పెంచడంలో కాళోజీది కీలకపాత్ర  అని కొనియాడారు. కాళోజి స్ఫూర్తి, తెలంగాణ సాధనలో, ప్రగతిలో ఇమిడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజి పేరున ప్రతి యేటా పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురస్కారాన్ని ఈ సంవత్సరం కూడా జరపనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కాళోజీ పురస్కారాన్ని అందుకుంటున్న, ప్రముఖ కవి జయరాజుకు కేసీఆర్‌ మరోసారి అభినందనలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news