ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత.. చింతమనేని అరెస్ట్

-

కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించే విషయంలో డిసెంబర్ 31వ తేదీ లోపు స్పష్టత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి మాజీ ఎంపీ హరి రామ జోగయ్య అల్టిమేట్ జారీ చేసిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో ఆమరణ దీక్ష చేస్తానని హరిరామ జోగయ్య హెచ్చరించారు. ఆ గడువు ముగిసిన నేపథ్యంలో హరి రామ జోగయ్య నిన్న రాత్రి నుంచి దీక్ష మొదలుపెట్టారు. దీంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ జోగయ్య ఎక్కడ తగ్గకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే దీక్ష చేపట్టారు.

ఈ నేపథ్యంలో దీక్షకు దిగిన హరి రామ జోగయ్యను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రి దగ్గర జనసేన, టిడిపి నేతలు ధర్నాకు దిగారు. సీఎం కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జోగయ్య ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేసి అక్కడి నుండి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version