యువకుడితో సహజీవనం చేయడంతో.. యువతి అనుమానాస్పద మృతి చెందిందని ఆరోపణలు వస్తున్నాయి. నల్గొండ జిల్లా నిడమానూరు మండలం బక్కమంతులపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ లో జాన్ రెడ్డి అనే యువకుడితో మల్లేశ్వరి సహజీవనం చేస్తున్నారు. మల్లేశ్వరిని కాదని మరో యువతిని పెళ్లి చేసుకున్నారు జాన్ రెడ్డి.

ఇదే సమయంలో మల్లేశ్వరి మృతి చెందారు. మల్లేశ్వరిని జాన్ రెడ్డి హత్య చేసి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. మల్లేశ్వరి మృతదేహంతో జాన్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.