కాంగ్రెస్ సర్కార్ పై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యా ఖ్య లు చేసారు. రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని వ్యాపారస్తులే అంటున్నారని బాంబు పేల్చారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని పేర్కొన్నారు.

అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని..ఆ ఖర్చును తాము భరిస్తామంటు న్నారని చెప్పారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు చేసిన పనులకు బిల్లులు చెల్లించే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.