ఇవాళ రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం..

-

మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కుమ్ములాటలు మొదలయ్యాయి. నేడు ఉదయం 11 గంటలకు శంషాబాద్ నోవాటెల్ హోటల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ అత్యవసర భేటీ కానున్నారు. ఈ భేటీకి మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మంత్రి వర్గ విస్తరణ విషయంలో తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకున్నాడు అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం అందుతోంది.

CLP emergency meeting chaired by Revanth Reddy at 11 am today at the Novatel Hotel, Shamshabad

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ విషయంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలు చేసారని అంటున్నారు. హెలికాప్టర్ లేకుండా నల్గొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బైట అడుగుపెట్టట్లేదు అంటూ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాకుంటే రాజీనామా చేస్తానన్న మల్ రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యలప సీఎల్పీ మీటింగ్‌లో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news