చంద్రబాబును వెంటాడుతోన్న “23” సెంటిమెంట్

-

టిడిపి అధినేత చంద్రబాబును ’23’ నంబర్ సెంటిమెంట్ వెంటాడుతోంది. 2019 ఎన్నికల్లో టిడిపికి 23 సీట్లు రాగా, చంద్రబాబు అరెస్ట్ అయిన తేదీ 9-9-23. ఆ అంకెలను కలిపితే మొత్తం 23 అవుతుంది. అలాగే రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నెంబర్ కేటాయించగా, వాటిని కూడితే 23 వస్తుంది. దీంతో ఆయనను 23 నెంబర్ వీడడం లేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

The 23 Number Sentiment Haunts Chandrababu Naidu

కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయణ్ను అదుపులోకి తీసుకోవడం.. అనంతరం జడ్జి ముందు నిలబెట్టడం.. రిమాండుకు తరలించడం.. ఈ ప్రక్రియంతా నాటకీయ పరిణామాల మధ్య చోటుచేసుకుంది. చంద్రబాబు అరెస్టు.. రిమాండు.. ఏపీలో కలకలం సృష్టిస్తోంది. బాబుకు మద్దతుగా ఓవైపు టీడీపీ.. మరోవైపు జనసేన.. ఇంకోవైపు అభిమానులు ఏపీ సర్కార్​కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.అయితే చంద్రబాబును రాజమహేంద్రవరం తరలించే ప్రక్రియలో ఏపీ పోలీసులు అరాచకానికి పాల్పడ్డారు. జోరు వర్షంలో వీధి దీపాలు ఆర్పించి ప్రయాణం కొనసాగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version