ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది…పోలవరం కోసం రూ.30 వేల కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు బడ్జెట్ రూపకల్ప చేశారట. సవరించిన పోలవరం నిర్మాణ వ్యయం రూ.30,436.95 కోట్లకు ఆమోదం తెలిపింది కేంద్ర సర్కార్. అటు 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వకు ఆమోదం తెలిపింది.

కేంద్రం నుంచి పోలవరం నిర్మాణానికి ఇంకా రావాల్సిన మొత్తం రూ.12,157.53 కోట్లు కాగా…తాజాగా పోలవరం కోసం రూ.30 వేల కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఇది ఇలా ఉండగా.. కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… పలు రంగాలకు, వేతన జీవులకు, రైతులకు, వెనక బడిన తరగతుల కు చెందిన మహిళలకు, విద్యారంగానికి శుభవార్త చెప్పారు. అయితే.. తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో ఎంత వచ్చే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.