తెలంగాణ మంత్రులతో సీఎం రేవంత్ కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో కేవలం పార్టీ అంతర్గత వ్యవహారాలు, జిల్లా మంత్రులు నియోజకవర్గ ఎమ్మెల్యేల మధ్య అంతరాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులకు సూచించినట్లు తెలిసింది. ఏ ఒక్కరూ పార్టీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తించకూడదని హితవు పలికినట్లు సమాచారం. ఒకరిద్దరూ మంత్రులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదని వారి నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ కారణంగానే జడ్చర్ల ఎమ్మెల్యే ఇంట్లో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారని, దీనికి కారణమైన మంత్రులను సీఎం రేవంత్ సీరియస్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.